Shraddha Srinath: రెడ్ డ్రెస్లో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ

by Pulgam srinivas |

ఎరుపు రంగు డ్రెస్‌లో టాటూ హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చిన శ్రద్ధ శ్రీనాథ్.

Shraddha Srinath: రెడ్ డ్రెస్లో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: కెరీర్ ప్రారంభంలో గ్లామర్ షో కంటే నటనపై ఎక్కువ దృష్టి పెట్టి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరు.



ఈమె జెర్సీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగులో మొదటి సినిమాలోనే తల్లి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో తన అందాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.




ఆ తర్వాత కూడా ఈమె వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ మెకానిక్ రాఖీ చిత్రంలో నటించింది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకునే శ్రద్ధ శ్రీనాథ్ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటుంది.




తాజాగా ఈమె తన 'ఇన్ స్టా' ఖాతాలో కొన్ని స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ ఎరుపు రంగులో ఉన్న టైట్ డ్రెస్ ధరించి, స్టైలిష్ ఇయర్ రింగ్స్‌తో ఆకట్టుకుంది.



ఒక సోఫాపై కూర్చుని, అలాగే నడుస్తూ, కిటికీ వద్ద నిలబడి తన టాటూ ఫోకస్ అయ్యేలా స్టైలిష్ స్టిల్స్ ఇచ్చింది. ముఖ్యంగా తన కురులను ముందుకు వేసుకుని కిల్లింగ్ లుక్స్‌తో కుర్రకారిని అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story