- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రంలో మరో హీరోయిన్.. జోడీ సూపర్‌గా ఉంటుందంటున్న ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (Dragon).

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (Dragon). డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘డ్రాగన్’కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్(Rukmini Vasant)ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సెకండ్ హీరోయిన్(Second heroine)గా మరో ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఇందులో కీలక పాత్ర కోసం బాలీవుడ్ (Bollywood) బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor)ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. శ్రద్ధా కపూర్ పార్ట్ సెకండ్ హాఫ్‌లో ఉండనుందని తెలుస్తుండగా.. ఆ పాత్ర సినిమాకు ప్లెస్ పాయింట్‌గా అవుతుందట. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ అండ్ శ్రద్ధా జోడీ సూపర్‌గా ఉంటుంది అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.






