Shraddha Kapoor: మరో డార్క్ ఫాంటసీ చిత్రాన్ని ఓకే చేసిన శ్రద్ధా కపూర్..

by Chukka Sudharani |   (  Updated:2025-10-14 09:41:58  IST  )

గత ఏడాది స్త్రీ-2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్.. ప్రస్తుతం ‘స్త్రీ-3’తో బిజీగా ఉంది.

Shraddha Kapoor: మరో డార్క్ ఫాంటసీ చిత్రాన్ని ఓకే చేసిన శ్రద్ధా కపూర్..
X

దిశ, సినిమా: గత ఏడాది స్త్రీ-2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్.. ప్రస్తుతం ‘స్త్రీ-3’తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ హీరోయిన్ ఇప్పుడు మరో డార్క్ ఫాంటసీ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీనికి రాహీ అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈయన డైరెక్షన్‌లో వచ్చిన ‘తుంబాద్’ ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. భారతదేశంలోనే బెస్ట్ హారర్ ఫాంటసీ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. అదే తరహాలో ఇప్పుడు ఆయన ‘పహాడ్‌పంగిరా’ అనే మరో డార్క్ ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మానవత్వం, పురాణాలు, మూఢనమ్మకాల బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ డార్క్ ఫాంటసీ కథలో ప్రధాన పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారట డైరెక్టర్ రాహీ అనిల్. ఇక ఈ సినిమాలో శ్రద్ధా హీరోయిన్‌గా నటిస్తుండటంతో పాటు నిర్మాతగా వ్యవరిస్తున్నారని టాక్. అలాగే కథలో ఉన్న ఒరిజినాలిటీ చూసి ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్‌గా అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ‘పహాడ్‌పంగిరా’ కథ పూర్తయినట్టుగా, ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తుండగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. లింక్

Next Story