Shraddha Kapoor: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రద్ధా కపూర్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-05-30 12:06:43  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor).. గత ఏడాది వచ్చిన ‘స్త్రీ-2’ (Stree-2) తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

Shraddha Kapoor: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రద్ధా కపూర్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor).. గత ఏడాది వచ్చిన ‘స్త్రీ-2’ (Stree-2) తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. శ్రద్ధా కపూర్‌తో పాటు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ-2 కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకు పైగానే రాబట్టి సూపర్ సక్సెస్‌ను ఇచ్చింది. ఇప్పుడు స్త్రీ ఫ్రాంచైజీలో స్త్రీ-3 కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది శ్రద్ధా. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకోబోతున్నట్లు తెలుస్తుంది.

రీసెంట్‌గా వచ్చిన ‘ఛావా’ (Chhaava) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar). విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ తన నెక్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దాదాపు శ్రద్ధా కపూర్‌ను ఫిక్స్ చేసేందుకు చూస్తున్నాడట లక్ష్మణ్ ఉటేకర్. మహారాష్ట్ర సంస్కృతి ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా స్క్రిప్ట్ శ్రద్ధాకు కూడా నచ్చినట్లు తెలుస్తుంది. దీంతో శ్రద్ధా కపూర్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. దీనికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

Next Story