నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. డైలమాలో రవితేజ సినిమా

by Naga Rani Yarlagadda |

తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. డైలమాలో రవితేజ సినిమా
X

దిశ, వెబ్‌డెస్క్: తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఫిలిం ఫెడరేషన్ కు.. కార్మికులకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో కార్మికుల వేతనాల పెంపుకు అంగీకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. వేతనాల పెంపుపై ఇరువర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా శుక్రవారం నుంచే షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. తాజాగా ఫెడరేషన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ లో అన్ని సినిమాల షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన షూటింగులను పూర్తిచేసేందుకు రెండ్రోజుల సమయం కేటాయిస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు.

ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం చివరిదశలో ఉన్న రవితేజ సినిమా మాస్ జాతర షూటింగ్ కు బ్రేక్ పడినట్లయింది. వారంరోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుందనగా షూటింగులకు ఫెడరేషన్ బ్రేక్ ప్రకటించడంతో.. మాస్ జాతర రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ చేసిన షూటింగ్స్ ను రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినా.. వారంరోజుల షూటింగ్ షెడ్యూల్ ను రెండ్రోజుల్లో ముగించడం అసాధ్యంగా కనిపిస్తోంది. కాగా.. ముందుగా మేకర్స్ ప్రకటించిన దానిప్రకారమైతే ఈ నెల 27న సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సినిమాపై హైప్ తీసుకొచ్చాయి.

Next Story