విజయ్ దేవరకొండ ‘రణబలి’ నుంచి షూటింగ్ వీడియో లీక్.. ఈసారి హిట్ కన్ఫర్మ్ అంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబలి’ చిత్రం నుంచి షూటింగ్ వీడియో లీక్ అయింది.

విజయ్ దేవరకొండ ‘రణబలి’ నుంచి షూటింగ్ వీడియో లీక్.. ఈసారి హిట్ కన్ఫర్మ్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబలి’. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విజయ్, రష్మిక ప్రేమ పెళ్లి చేసుకోగా.. వీరిద్దరు నటిస్తున్న రణబాలి (విజయ్), జయమ్మ (రష్మిక) పాత్రలపై క్యూరియాసిటీ నెలకొంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టేజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా షూటింగ్ వీడియో లీక్ అయింది. ‘రేమ్ ముండమోపినాకొడకా.. ఏడున్నావ్ రా.. మీ ఇళ్లల్లోకి వచ్చిన.. రా అవ్వా చంపుదువు కానీ’ అంటూ విజయ్ గుర్రంపై వస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఈసారి విజయ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు.. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. షూటింగ్ వీడియో లింక్

Next Story