ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ వల్ల నిలిచిపోయిన ‘డ్రాగన్’ షూటింగ్?

by Pulgam srinivas |

'డ్రాగన్'లోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రశాంత్ నీల్, తారక్‌కు ప్రత్యేకమైన లుక్‌ను డిజైన్ చేశారట. అయితే ఫైనల్ సమయానికి ఆ లుక్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తి చెందినట్లు సమాచారం. దాంతో ఆ ఎపిసోడ్ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ వల్ల నిలిచిపోయిన ‘డ్రాగన్’ షూటింగ్?
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెలలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ చాలా ప్రత్యేకంగా కనిపించాలని భావించిన ప్రశాంత్, ఆయనకు ఒక ప్రత్యేకమైన లుక్‌ను డిజైన్ చేశారట.

కానీ ఫైనల్ సమయానికి ఆ లుక్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తి చెందినట్లు సమాచారం. ఇక తారక్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తూ, సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ అనుకున్న లుక్ వచ్చిన తర్వాతే షూటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్‌కు కాస్త గ్యాప్ వచ్చినట్లు సమాచారం. ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న తారక్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో, ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story