- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య 47 సినిమా షూటింగ్ పూర్తి.. ఆ స్పెషల్ డే నాడు టైటిల్ రివీల్!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

దిశ, సినిమా: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కరుప్పు’చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ‘సూర్య 46’తో పాటు మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్, ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 47’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. జూలై 23న సూర్య పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి చిత్ర బృందం 37 సెకన్ల నిడివి గల ఒక బిహైండ్ ది సీన్స్ వీడియోను కూడా విడుదల చేసింది.
ఇందులో షూటింగ్ సెట్‌కు సంబంధించిన ఆసక్తికర దృశ్యాలతో పాటు సూర్య, నజ్రియా నజీమ్ సందడి చేశారు. యువ నటుడు నస్లెన్ కూడా ఇందులో కనిపించినప్పటికీ, అతని లుక్‌ను మాత్రం మేకర్స్ కాస్త సీక్రెట్‌గా ఉంచారు. ఈ గ్లింప్స్‌తో పాటు మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఐ యామ్ ది వన్ అనే అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ థీమ్ మ్యూజిక్‌ను కూడా పరిచయం చేశారు. ఈ సినిమాలో సూర్య ఒక విభిన్నమైన, కాస్త విచిత్రమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తన కింద ఉండే ఒక క్రేజీ టీమ్‌తో కలిసి ఆయన చేసే ఒక మిషన్ చుట్టూ ఈ కథ తిరగనుందని టాక్. ఈ సినిమాకు 'సీన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్.






