- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జన నాయగన్' వరల్డ్‌వైడ్ థియేటర్ కౌంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
'జన నాయగన్' చిత్రాన్ని 7,000 నుంచి 8,000 స్క్రీన్‌లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా తొలుత ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కానున్న తొలి సినిమా కావడంతో దీనిపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 'జన నాయగన్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ చిత్రాన్ని సుమారు 30 దేశాల్లో, 7,000 నుంచి 8,000 స్క్రీన్‌లలో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్‌లోనే కాకుండా తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనూ అత్యంత భారీ విడుదలల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.






