ROHIT SHETTY: బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

by Ajay Maddhiboyina |

బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జ‌రిగాయి. ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై అర్ధ‌రాత్రి 12:40కి గుర్తు తెలియ‌ని యువ‌కుడు కాల్పులు జ‌రిపాడు.

ROHIT SHETTY: బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు
X

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జ‌రిగాయి. ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై అర్ధ‌రాత్రి 12:40కి గుర్తు తెలియ‌ని యువ‌కుడు కాల్పులు జ‌రిపాడు. బైక్ పై వ‌చ్చిన దుండ‌గుడు ఆరు రౌండ్లు కాల్పులు జ‌రిపి అక్క‌డ నుండి వెళ్లిపోయాడు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఐదు బుల్లెట్ షెల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు అవ్వ‌లేదు. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది.

Next Story