ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. 'ఆ పోస్టులు షేర్ చేసేది డార్లింగ్ కాదు'

by Yella Dhawani Reddy |

రెబల్ స్టార్ ప్రభాస్‌కు (Prabhas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. ఆ పోస్టులు షేర్ చేసేది డార్లింగ్ కాదు
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్‌కు (Prabhas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బహుబలి' (Bahubali) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక 'సాహో' సినిమా విడుదల ముందు ఇన్ స్టాలో అడుగుపెట్టిన డార్లింగ్‌కు.. ప్రస్తుతం 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తన లైఫ్‌ స్టైల్‌ గురించి నెట్టింట రేర్‌గానే పంచుకుంటుంటారు ప్రభాస్. కేవలం తన సినిమాకు సంబంధించిన విషయాల పైనే అప్‌డేట్లు ఇస్తూ కనిపిస్తారు. అయితే తాజాగా ప్రభాస్‌ ఇన్‌స్టా అకౌంట్ గురించి మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పృథ్వీరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడారు. సలార్ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో క్లోజ్ అయినట్లు తెలిపారు. ప్రభాస్‌కు అసలు స్టార్‌డమ్‌ను పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదని, చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పారు. అలాగే ప్రభాస్ పబ్లిక్‌లో ఉండటానికి బదులు ప్రైవేట్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడని, ఫామ్‌హౌస్‌లో సంతోషంగా ఉంటాడని తెలిపారు. సోషల్ మీడియా కూడా వాడడని, ఇన్‌స్టాలో చేసే పోస్టులు కూడా డార్లింగ్ షేర్ చేసేవి కాదని వెల్లడించారు. ప్రభాస్‌లా ఉండటం చాలా గ్రేట్ అని, ఇది అతడి నుంచి అందరూ నేర్చుకోవాలని పృథ్వీరాజ్ తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

ఇక, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా 'సలార్' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. SSMB29 (మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో) సినిమాలోనూ పృథ్వీరాజ్‌ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, పృథ్వీరాజ్‌ 'లూసిఫర్‌2: ఎంపురాన్‌'తో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'లూసిఫర్‌'.. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు 'లూసిఫర్‌ 2: ఎంపురాన్‌ (రాజు కన్నా గొప్పవాడు)' (Empuraan) పేరిట ప్రీక్వెల్‌ కమ్‌ సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story