రాజమౌళి వివాహంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి.. రమకు ఆయన రెండో భర్తనా..?

by Disha Web Desk 7 |
రాజమౌళి వివాహంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి.. రమకు  ఆయన రెండో భర్తనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుని మాటల మాంత్రికుడిగా పేరొందారు. అయితే రాజమౌళి ప్రతి సన్నివేశం వెనుక తన కుటుంబం ఉండాల్సిందే. ముఖ్యంగా రాజమౌళి భార్య రమా అతనికి ఎంతో సపోర్ట్‌గా నిలుస్తారు. ఇదిలా ఉంటే.. రమా రాజమౌళి గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. రమకు రాజమౌళి మొదటి భర్త కాదట. ఆమెకు ఇంతకు ముందే ఓ వివాహం జరిగిందట. అసలు విషయం ఏంటంటే..

రమా మొదటి భర్త బాగా తాగి వచ్చి టార్చర్ చేసేవారట. అంతే కాదు రమకు అప్పటికి కార్తికేయ కూడా పుట్టారు. అయితే భర్త పెట్టే టార్చర్ భరించలేక.. కీరావాణి భార్య శ్రీవల్లి దగ్గరకు వచ్చేశారు రమ. శ్రీవళ్లి, రమ అక్క చెల్లెల్లు. అలా వచ్చి ఒక సంవత్సరం పాటు అక్క ఇంట్లోనే ఉండిపోయింది రమ. తర్వాత భర్తలో మార్పు రాకపోవడంతో విడాకులు ఇచ్చేశారు. కొన్నాళ్ల తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ టైంలో రాజమౌళి, రమ ప్రేమించుకుని.. తర్వాత వివాహం చేసుకున్నారు. కార్తికేయ పుట్టిన కూడా అతడిని సొంత బిడ్డల చూసుకున్నారు రాజమౌళి. అంతే కాకుండా పిల్లలు పుడితే కార్తికేయని ఎక్కడ దూరం పెడతారేమో బిడ్డలను కూడా కనలేదట. ఈ క్రమంలోనే ఓ అమ్మాయిని (మయోక్ష) ఎడాప్ చేసుకున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. నెట్టింట్ ఈ వార్త హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. దీంతో కొంత మంది రాజమౌళిని ప్రసంశిస్తుంటే మరుకొందరూ మాత్రం నెగిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed