‘డబ్బుల్లేక ఆ సమయంలో అలా చేయాల్సొచ్చింది’.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-12 15:13:30  IST  )

ప్రముఖ బాలీవుడ్ నటి(Bollywood Actor) దియా మీర్జా(Dia Mirza) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘డబ్బుల్లేక ఆ సమయంలో అలా చేయాల్సొచ్చింది’.. ప్రముఖ నటి  షాకింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి(Bollywood Actor) దియా మీర్జా(Dia Mirza) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆసియాపసిఫిక్ ఇంటర్నేషనల్ విజేతగా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ నిర్మాతగా కూడా రాణిస్తోంది. పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు పొందలేకపోయింది. 2021లో విడుదలైన ‘వైల్డ్ డాగ్’ తెలుగు చిత్రంలో నటించారు. అయితే.. నటి దియా ఎక్కువగా సోషల్ వర్క్ చేస్తూంటుంది. ఈ నేపథ్యంలో సమాజ సేవకురాలిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమెకు 2013లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ 2012 గ్రీన్ అవార్డు లభించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా నటి దియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మోడలింగ్ రోజుల్లో తాను ఎదుర్కొన్న సవాళ్లు గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆ సమయంలో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. కుటుంబ సభ్యుల నుంచి సపోర్టు ఉండేది కాదని చెప్పారు. 2000 సంవత్సరంలో లారా దత్త, నేను, ప్రియాంక చోప్రా మిస్ ఇండియా పోటీల్తో పాల్గొన్నాము.

ప్రియాంకకి తన కుటుంబ సభ్యుల నుంచి చాలా సపోర్టు ఉండేది. కానీ లారాదత్తాకి నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు. ఈ క్రమంలో మేము చాలా బాధ అనుభవించాం. మోడలింగ్‌లో రాణిస్తున్న కాలంలోనే లారా ముంబైలోని ఒక చిన్నఇంట్లో రెంట్‌కు ఉండేది. పరిస్థితుల కారణంగా నేను ముంబైకి వచ్చాను. అప్పుడు లారా నాకు హెల్ప్ చేసింది. అదే ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వడంతో.. ఇద్దరం కలిసి ఉండేవాళ్లం. కానీ ఆ సమయంలో చేతుల్లో డబ్బులు లేక ఇద్దరం నూడుల్స్ తినేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది.

READ MORE ...

Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్‌.. IIFA లో కన్ఫామ్ చేసిన హీరో తల్లి?


Next Story