రిలేషన్‌లో గొడవలు, విభేదాలు సహజం.. అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-12 10:15:06  IST  )

రియల్ లైఫ్‌లో ఏ ఇద్దరు భాగస్వాములు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరని నటి శోభిత దూలిపాళ అన్నారు. రిలేషన్‌లో గొడవలు, విభేదాలు సహజమని చెప్పారు.

రిలేషన్‌లో గొడవలు, విభేదాలు సహజం.. అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో శోభితా ధూళిపాళ(Shobitha Dhulipala) ఒకరు. పెళ్లి తర్వాత వెండితెరపై కనిపించని శోభిత, పలు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'చీకటిలో'(chikatilo). ఇందులో ఈషా చావ్లా, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్(Daggubati Suresh babu) బాబు నిర్మాణ సారథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి తిమ్మరుసు ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon Prime Video)లో జనవరి 23న నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.

ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. ‘ ‘చీకటిలో’ కథలోని రిలేషన్‌షిప్ కోణం నాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్‌లో ఏ ఇద్దరు భాగస్వాములు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరు. రిలేషన్‌లో గొడవలు, విభేదాలు సహజం. అదే నిజాన్ని మా పాత్రల ద్వారా ఈ సినిమాలో చూపించాం. చాలా కాలం తర్వాత నేను డైరెక్ట్ తెలుగులో నటిస్తున్నాను. ‘చీకటిలో’లో నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది’ అని శోభిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

అక్కినేని కోడలు లేటెస్ట్ పోస్ట్.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించడంతో వైరల్

Next Story