- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sobhita Dhulipala: గుడ్ న్యూస్ ప్రకటించిన అక్కినేని కోడలు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
నటి శోభిత నటించిన ‘మంకీ మ్యాన్’ బాఫ్టా ఆమోదం పొందడంతో పాటు రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్ర స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటిష్ దర్శకుడు, నిర్మాత దేవ్ పటేల్(Dev Patel) అవార్డు అందుకున్నట్లు తెలిపింది.

దిశ, సినిమా: నటి మోడల్ శోభిత దూళిపాళ(Sobhita Dhulipala ) పలు చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక గత ఏడాది ‘మంకీమ్యాన్’(Monkey Man) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్ల నుంచి నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో ఉన్న ఆమె పెద్దలను ఒప్పించి గత ఏడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత నుంచి సినిమాలు ప్రకటించకుండా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కినేని ఇంటికి కోడలు కావడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు.
శోభిత సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ చైతుతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, శోభిత ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను నటించిన ‘మంకీ మ్యాన్’ బాఫ్టా ఆమోదం పొందడంతో పాటు రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్ర స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటిష్ దర్శకుడు, నిర్మాత దేవ్ పటేల్(Dev Patel) అవార్డు అందుకున్నట్లు తెలిపింది. అయితే మంకీ మ్యాన్ బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ కేటగిరీలో గెలుపొందినట్లు తెలుపుతూ.. ‘‘నేను కలలు కంటున్నానా అనిపిస్తుంది. 2024 బాఫ్తా నామినేషన్‌లో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా మంకీమ్యాన్ నిలిచింది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






