Shobhitha Dhulipala: 6 ఇయర్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన అక్కినేని కోడలు.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-08 15:24:07  IST  )

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది.

Shobhitha Dhulipala: 6 ఇయర్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన అక్కినేని కోడలు.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya).. సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది.

అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్‌కి కూడా వెళ్ళింది. అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడటంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఆ విషయం పై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్‌గా మ్యారేజ్(Marriage) చేసుకుని భార్యా భర్తలు అయ్యారు.

ఇక అప్పటినుంచి అక్కినేని కోడలు స్టేటస్‌తో పాటు భర్తతో ఎంజాయ్ చేస్తుంది శోభిత. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో 6 ఇయర్స్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అలాగే ఆ సిరీస్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అంతేకాకుండా.. ‘ఉక్కు పూత పూసిన వెచ్చని హృదయం.. తారా కేవలం ఒక పాత్ర కాదు, ఆమె ఒక మానసిక స్థితి అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వాంట్ మోర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు అక్కినేని కోడలు పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.


Read Also..

సెలబ్రేటింగ్ పవర్ ఆఫ్ ఉమెన్ అంటూ 'శివంగి' నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్


Next Story