గోల్డెన్ శారీలో బంగారంలా మెరిసిపోతున్న శోభిత.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ ఫొటోస్

by I. Sairam |

స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dhulipala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

గోల్డెన్ శారీలో బంగారంలా మెరిసిపోతున్న శోభిత.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ ఫొటోస్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dhulipala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని మూవీస్ చేసి ఇక్కడ కూడా పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) సమంత(samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది.

ఆ తర్వాత గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. ఇక అప్పటినుంచి అతనితో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పర్సనల్ విషయాలు, సినిమా విషయాలు చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న పిక్స్‌లో శోభిత గోల్డెన్ కలర్ శారీ కట్టుకొని ఉంది. ఇక దీనికి మొత్తం గోల్డ్ కలర్ ఆర్నమెంట్స్‌తో పెయిరప్ చేసింది. నెట్టెట్‌గా ఉన్న చీరలో నడుమందాలు కనిపించేలా ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. అలా గోల్డెన్ కలర్ శారీలో బంగారంలా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన అక్కినేని ఫ్యాన్స్ శోభిత వదిన సూపర్ ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story