- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sobhita Dhulipala: ఆ విషయంలో అదృష్టంగా భావిస్తున్నా.. నాగచైతన్యపై శోభిత ఆసక్తికర కామెంట్స్
శోభిత తన భర్త నాగచైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. చైతన్య తన జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపింది. అతని సింప్లిసిటి(Simplicity), అందరితో గౌరవంగా ఉండే విధానం ఎంతో నచ్చుతాయని చెప్పింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala), నాగచైతన్య(Naga Chaitanya) గత కొద్ది కాలం నుంచి డేటింగ్ చేశారు. ఇటీవల పెద్దలను ఒప్పించి డిసెంబర్ 4న గ్రాండ్‌గా అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన భర్త నాగచైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘చైతన్య నా జీవితంలోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
అతని సింప్లిసిటి(Simplicity), అందరితో గౌరవంగా ఉండే విధానం నాకు ఎంతో నచ్చుతాయి. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతు నుంచి నేను నేర్చుకున్నాను. అయితే పెళ్లి తర్వాత మేము శ్రీశైలం(Srisailam) వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువ. నా జీవితంలో అది కూడా ఓ భాగమే. టైమ్ దొరికినప్పుడల్లా నేను కూచిపూడి(Kuchipudi), భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇక వంట విషయంలో అయితే ఆవకాయ, ముద్ద పప్పు బాగా చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభిత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More...
Samantha: "నాకు ఆ ప్రేమ కంటే ఏది గొప్పది" కాదంటూ షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత






