చీరలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన శోభిత ధూళిపాళ.. ఫస్ట్ టైం అక్కినేని కోడలిగా కనిపిస్తున్నావంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-02-12 11:48:05  IST  )

నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది శోభిత. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్రౌన్ కలర్ బ్లౌజ్, సిల్వర్ కలర్ శారీ కట్టుకుంది. అలాగే కొప్పు పెట్టుకుని మల్లెపూలతో పాటు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టుకుంది. అంతేకాకుండా నుదిటిన, పాపిట్లో కుంకుమ పెట్టుకుంది. దీంతో కంప్లీట్ అచ్చతెలుగు కోడలి లుక్ వచ్చేసింది.

చీరలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన శోభిత ధూళిపాళ.. ఫస్ట్ టైం అక్కినేని కోడలిగా కనిపిస్తున్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ చైతన్యతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే పలు ఈవెంట్స్‌కు వెళుతూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఈ జంట. అయితే ప్రజెంట్ చైతన్య- శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది శోభిత. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్రౌన్ కలర్ బ్లౌజ్, సిల్వర్ కలర్ శారీ కట్టుకుంది. అలాగే కొప్పు పెట్టుకుని మల్లెపూలతో పాటు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టుకుంది. అంతేకాకుండా నుదిటిన, పాపిట్లో కుంకుమ పెట్టుకుంది. దీంతో కంప్లీట్ అచ్చతెలుగు కోడలి లుక్ వచ్చేసింది. ఇక ఈ ఫొటోస్‌కు.. ‘ఈరోజు వేవ్‌ సమ్మిట్ ఇండియాలో ఉండటం గౌరవంగా మరియు సంతోషంగా ఉంది’ అని లవ్ సింబల్ జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫస్ట్ టైం అక్కినేని కోడలిగా కనిపిస్తున్నావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story