- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరోయిన్ కు అవమానం.. చెట్టు వెనకే అవి మార్చుకోమన్నారు!
ఒకప్పటి సీనియర్ హీరోయిన్ శోభన (Heroine Shobhana) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అప్పటి హీరోయిన్ శోభన

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పటి సీనియర్ హీరోయిన్ శోభన (Heroine Shobhana) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అప్పటి హీరోయిన్ శోభన తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని.. తాజాగా బయట పెట్టింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గతంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది శోభన. చెట్టు వెనక బట్టలు మార్చుకోమన్నారని... గుర్తు చేస్తూ ఎమోషనల్ అయింది సీనియర్ హీరోయిన్ శోభన.
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హీరోగా నటించిన ఓ సినిమాలోని సాంగ్ లో డాన్స్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో... బట్టలు మార్చుకునేందుకు కారవాన్ ( Caravan) అడిగితే... చెట్ల వెనుకకు వెళ్లి మార్చుకోమని.. తన పరువు తీసారని ఫైర్ అయింది. తనను చులకనగా చూస్తూ మాట్లాడారని చిత్ర బృందంపై మండిపడింది.
కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ విషయం తెలియగానే.. గొప్ప మనసుతో కారవాన్ ను తనకు ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ సమయంలో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పినట్లు.. వివరించింది సీనియర్ హీరోయిన్ శోభన. ఇది ఇలా ఉండగా... హీరోయిన్ శోభన... అప్పట్లో... మెగాస్టార్ చిరంజీవి లాంటి తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెరిసిన సంగతి తెలిసిందే.






