- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపేంద్ర రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివరాజ్ కుమార్
కర్ణాటకలో తోటి నటుడు అయిన ఉపేంద్రకు సపోర్ట్ చేయడంలో తప్పేంటని శివరాజ్‌కుమార్ ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, కన్నడ సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోలుగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. 2018లో నటుడు ఉపేంద్ర ‘ఉత్తమ ప్రజాకీయ’ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా ఉపేంద్ర రాజకీయ ప్రస్థానం గురించి శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ… “ఉపేంద్ర గారు ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అది చాలా మంచి విషయం. తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. అలాగే ఆయన ముఖ్యమంత్రి కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక కొంతకాలం క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఆయన అద్భుతమైన స్థాయిలో స్థానాలు దక్కించుకుని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక కర్ణాటకలో తోటి నటుడు అయిన ఉపేంద్రకు సపోర్ట్ చేయడంలో తప్పేంటి?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక తాజాగా శివరాజ్‌కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






