- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా అయితే ఇండస్ట్రీలో కనబడకుండా పోతావని వార్నింగ్ ఇచ్చారు.. Shivani Nagaram
శివానీ మాట్లాడుతూ.. "ఇలా తక్కువ సినిమాలు చేస్తూ పోతుంటే కొంతకాలానికి ఇండస్ట్రీలో కనబడకుండా పోతావని కొంతమంది హెచ్చరించారు. కానీ వాటిని నేను అస్సలు పట్టించుకోవట్లేదు" అని ఈ నటి చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తక్కువ సమయంలో మంచి గుర్తింపును తెలుగు సినిమా పరిశ్రమలో దక్కించుకున్న వారిలో యంగ్ బ్యూటీ శివానీ నాగారం ఒకరు. ఈ చిన్నది సుహాస్ హీరోగా రూపొందిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి సక్సెస్ను అందుకోవడంతో శివానీకి మంచి గుర్తింపు దక్కింది. ఈ ముద్దుగుమ్మ కొంతకాలం క్రితం లిటిల్ హార్ట్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ను అందుకుంది. తాజాగా శివానీ, సుహాస్ హీరోగా గోపి దర్శకత్వంలో రూపొందిన హే భగవంత్ చిత్రంలో కథానాయికగా నటించింది.
ఈ ఇంటర్టైనర్ను ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయనున్నారు. హే భగవంత్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో శివానీ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటిమణి తన కెరియర్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శివానీ మాట్లాడుతూ... "నేను ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఇది మూడవ సంవత్సరం. అయినా నేను మూడు సినిమాల్లో మాత్రమే నటించాను.
దానితో చాలామంది 'మీరెందుకు స్పీడ్గా సినిమాలు చేయట్లేదు?' అని అంటున్నారు. నేను ఎన్ని సినిమాల్లో నటించాను అనేదానికంటే ఎన్ని మంచి సినిమాల్లో నటించాను అనేదే ముఖ్యం అని భావిస్తానని వారికి సమాధానం ఇచ్చాను. నేను తక్కువ సినిమాలను ఎంచుకుంటూ వెళ్లడంతో కొంతమంది 'ఇలా అయితే ఇండస్ట్రీలో కనబడకుండా పోతావు' అని కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారు చేసిన కామెంట్లను కూడా నేను ఏమాత్రం పట్టించుకోకుండా నాకు నచ్చిన దారిలోనే వెళుతున్నాను" అని చెప్పుకొచ్చింది.






