- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడే నిన్ను నువ్వుఎక్కువగా ప్రేమించుకో.. నీపై నువ్వు దయ చూపించుకో.. లవ్ బ్రేకప్‌పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బుల్లితెర బ్యూటీ
బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ శివాంగి జోషి.. తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ శివాంగి జోషి.. తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు కుశాల్ టాండన్‌తో మొన్నటి వరకు ప్రేమ వ్యవహారం నడిపిన విషయం తెలిసిందే. ‘బర్సతేన్-మౌసమ్ ప్యార్ కా’ అనే షోతో ప్రేమలో పడ్డా శివాంగి, కుశాల్ కొన్నాళ్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. వీరికి సంబంధించిన ఫొటోలు సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టేవి. అయితే.. ఏమైందో తెలియదు గత కొద్ది కాలంగా వీరిద్దరికి బ్రేకప్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా.. నటుడు కుశాల్ టాండన్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ‘నేను నా సహనటి శివంగి జోషి ఇకపై కలిసి ఉండాలి అనుకోవం లేదు.. కొన్ని నెలల క్రితమే మేము విడిపోయాం’ అంటూ స్టోరీలో చెప్పుకొచ్చాడు. అయితే.. కుశాల్ ఆ స్టోరీని తొలగించినప్పటికీ అది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది.
ఈ క్రమంలోనే తాజాగా శివాంగి జోషి పెట్టిన పోస్ట్ బాలీవుడ్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు ‘బేబీ గర్ల్.. ఇప్పుడే నిన్ను నువ్వు కొంచెం ఎక్కువగా ప్రేమించుకో.. నువ్వు చాలా వాటిని బ్యాలెన్స్ చేస్తున్నావు.. ఎవరికి తెలియని వాటిని కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నావు. నీ శక్తి మేరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు. కాబట్టి.. ఫస్ట్ నీపై నువ్వు దయ చూపించుకో’ అనే ఒక క్యాప్షన్ షేర్ చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్ కావడంతో.. కుశాల్‌తో బ్రేకప్ కారణంగానే ఈ పోస్ట్ పెట్టిందంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు నెటిజన్లు. లింక్






