కమర్షియల్ అంశాలతో ‘దండోరా’

by Sujitha Rachapalli |

‘దండోరా’ అన్ని రకాల కమర్షియల్ అంశాలతో కూడిన అద్భుతమైన చిత్రం అన్నారు నటుడు శివాజీ. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన సినిమాకు మురళీ కాంత్ దర్శకత్వం వహించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి,

కమర్షియల్ అంశాలతో ‘దండోరా’
X

దిశ, సినిమా : ‘దండోరా’ అన్ని రకాల కమర్షియల్ అంశాలతో కూడిన అద్భుతమైన చిత్రం అన్నారు నటుడు శివాజీ. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన సినిమాకు మురళీ కాంత్ దర్శకత్వం వహించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రా ముఖ్యపాత్రలు పోషించారు. డిసెంబర్ 25న చిత్రం రిలీజ్ కాబోతుండగా.. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు శివాజీ. ‘కోర్ట్’ కంటే ముందుగానే ఈ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నానన్న ఆయన.. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నాడు. అసలు ఈ పాత్రలో శివాజీ మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదని.. సినిమా చూసిన తరువాత ఆడియన్స్ తన పాత్ర గురించి చెప్పాలన్నాడు. ఇక ఈ చిత్రంలో తాను వ్యవసాయదారుడిగా కనిపిస్తానని.. అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ తన చుట్టూనే తిరుగుతాయన్నాడు. అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అని.. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయన్నాడు. ‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదని.. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన అద్భుతమైన సినిమా అన్నాడు. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుందని.. మూవీ చాలా నేచురల్‌గా ఉంటుందన్నాడు.

Next Story