- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shiva 4K: నాగార్జున 'శివ'4K ట్రైలర్ అదుర్స్
36 సంవత్సరాల కిందట విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా శివ. అక్కినేని నాగార్జున

దిశ, వెబ్ డెస్క్: 36 సంవత్సరాల కిందట విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా శివ. అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు దుమ్ము లేపింది. అయితే ఈ నెల 14వ తేదీన శివ మూవీని 4K డాల్బీ అట్మాస్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ కూడా లాంచ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్ లాంచ్ చేసేందుకు ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు అక్కినేని నాగార్జున మెరిశారు. తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... 36 సంవత్సరాల కిందట నాతో శివ సినిమా తీసి నన్ను పెద్ద స్టార్ చేసింది రాంగోపాల్ వర్మ అని వెల్లడించారు. రాంగోపాల్ వర్మ దాదాపు 6 నెలలుగా రీ -రిలీజ్ కోసం కష్టపడుతున్నాడని తెలిపారు. శివ డాల్బీ అట్మాస్ లో రియల్లీ మైండ్ బ్లోయింగ్ ఉంటుందని వెల్లడించారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని కోరారు.
అటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... రీ-రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ తాను మాట్లాడతానని ఎప్పుడూ ఊహించుకోలేదని పేర్కొన్నారు. అప్పట్లో నాగార్జున తనకు విజువల్ గా సౌండ్ పరంగా చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ రోజు కూడా అంతే ఫ్రీడమ్ ఉందని వివరించారు. రీ-రిలీజ్ కోసం సౌండ్ ను చాలా బెటర్ గా డిజైన్ చేసినట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి.. ప్రేక్షకులకు అందించనున్నట్లు వెల్లడించారు. చిరంజీవి చెప్పినట్లుగా సినిమా ఉన్నంత వరకు శివ చిరంజీవి లాగా చిరస్మరణీయం అంటూ RGV వ్యాఖ్యానించారు.






