- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలైవర్ దర్శనం కోసం థియేటర్లకు వెళ్తున్నారా.. అయితే ఈ డబుల్ ట్రీట్ మీకోసమే..
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Shiva Kartikeyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘మదరాసి’

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Shiva Kartikeyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘మదరాసి’ (Madharaasi) ఒకటి. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ రూపొందిస్తుంది. ఈ విజువల్ వండర్‌లో బిజు మీనన్, షబీర్, విక్రాంత్, విద్యుత్ జామ్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనురుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు అండ్ హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.
ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచగా.. తాజాగా గ్లింప్స్ అప్డేట్ ఇచ్చింది. ‘తలైవర్ దర్శనం కోసం థియేటర్లకు వెళ్తున్నారా? అయితే ఇది మీకు డబుల్ ట్రీట్.. కూలీ ఫైర్‌తో పాటు పెద్ద స్క్రీన్‌లలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతున్న మధరాసి ఎక్స్‌టెండెడ్ గ్లింప్స్‌ను కూడా చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ రజినీకాంత్ (Rajinikanth) సినిమా కూలీ(Coolie)తో పాటు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. లింక్






