- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shine Tom Chacko : "ఔను.. డ్రగ్స్ తీసుకున్నా.." : ప్రముఖ నటుడి సంచలన స్టేట్మెంట్
డ్రగ్స్(Drugs) వాడుతున్నారనే ఆరోపణలతో ప్రముఖ మలయాళం నటుడు షైన్ టామ్ చాకొ(Shine Tom Chacko)ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : డ్రగ్స్(Drugs) వాడుతున్నారనే ఆరోపణలతో ప్రముఖ మలయాళం నటుడు షైన్ టామ్ చాకొ(Shine Tom Chacko)ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో చాకొ కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. తాను డ్రగ్స్ వాడటం నిజమేనని పోలీసుల వద్ద ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతోమంది డ్రగ్స్ వాడుతుంటారని, తననే పోలీసులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగినట్టుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు తాను అడిగినపుడు తెచ్చి ఇచ్చినట్టు, కొన్నిసార్లు సినిమా సెట్స్ లోకి తీసుకు వచ్చారని చెప్పారట. చాకొ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ను సైతం పరిశీలిస్తున్నారు.
అందులో పేమెంట్స్ గురించి అడిగినపుడు.. అవి వారికి అప్పు ఇచ్చినట్టు చాకొ పేర్కొన్నారట. ఇక హోటల్ నుంచి పారిపోయిన ఘటన గురించి అడగ్గా.. అక్కడికి తాను తెలిసిన అమ్మాయిని కలవడానికి వచ్చానని.. కొంతమందితో ఉన్న గొడవ నేపథ్యంలో.. వారు నాకోసం వచ్చారని పారిపోయాయని వెల్లడించినట్టు సమాచారం. నటి విన్సీ చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా.. తాను ఎవ్వరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదని, ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందని చాకొ తెలిపినట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.






