- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హ్యాట్రిక్ కొట్టిన షైన్ స్క్రీన్స్.. ఒక్క దెబ్బతో ఆ సినిమాపై అమాంతం పెరిగిన అంచనాలు
షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేత సాహు గారపాటి, వరుసగా ‘కిష్కిందపురి’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘రవాజా 2’ చిత్రాలతో మూడు విజయాలను అందుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. ముఖ్యంగా నిర్మాతలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తరచూ వినిపిస్తోంది. ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ, ఒక్క సినిమాతోనే లాభాలు రాబట్టడం కూడా కష్టంగా మారిందని కొంతమంది నిర్మాతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓ నిర్మాణ సంస్థ మాత్రం వరుసగా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకుని ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఆ సంస్థ మారేదో కాదు షైన్ స్క్రీన్స్ బ్యానర్. ఈ సంస్థ అధినేత సాహు గారపాటి, వరుస విజయాలతో తన సంస్థను పాన్ ఇండియా స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు. కొంతకాలం క్రితం ఆయన, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘కిష్కిందపురి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఆయన నిర్మించిన 'వాజా 2' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు 13 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇలా వరుసగా మూడు విజయాలను అందుకుని హ్యాట్రిక్ కొట్టిన సాహు గారపాటి ప్రస్తుతం వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను నిర్మిస్తున్నారు. వరుస విజయాల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.






