- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shilpa Shetty: బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ షో
బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ స్టిల్స్‌తో హీట్ పెంచుతున్న శిల్పా శెట్టి

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ సీనియర్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె కెరీర్ పీక్‌లో కొనసాగుతున్న సమయంలో తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.
ఈ బ్యూటీ వెంకటేష్ హీరోగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహస వీరుడు సాగర కన్య అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. శిల్పా శెట్టి ఆ తర్వాత వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది.
కానీ ఏ సినిమా కూడా ఈమెకు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. దాంతో ఈమె ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో నటించడం మానేసింది. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సీనియర్ నటి వయసు 50 సంవత్సరాలు అయినప్పటికీ, కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజ్‌లో తన అందాలను మెయింటైన్ చేస్తూ యువతను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలలో ఈమె బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ లాంగ్ గౌన్ ధరించి, మెడలో అందమైన నెక్లెస్ వేసుకొని, హెయిర్‌ను ఎంతో స్టైలిష్‌గా ముడి వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ డ్రెస్‌లో ఈ హాట్ బ్యూటీ ఎద అందాలతో ఆకట్టుకుంది. దాంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






