నీ భార్యకు ఇస్తావా ఈ సర్‌ప్రైజు.. శేఖర్ మాస్టర్‌పై బూతులతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్

by Bhoopathi Nagaiah |

‘‘పుష్ప 2’’లో పీలింగ్స్ సాంగ్‌కే ఈయన కొరియోగ్రఫీకి దుమ్మెత్తిపోసిన నెటిజన్లు ఈ పాటకు నెక్స్ట్ లెవల్ బూతులు వెతుక్కుంటున్నారు.

నీ భార్యకు ఇస్తావా ఈ సర్‌ప్రైజు.. శేఖర్ మాస్టర్‌పై బూతులతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
X

దిశ, ఫీచర్స్ : నితిన్-శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. రీసెంట్‌గా ఓ తమిళ్ డబ్బింగ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఫంక్షన్‌లో నిర్మాత నితిన్-శ్రీలీలను మహేష్ బాబు-ఇలియానా జోడితో పోల్చాడు. తెరపై ఎవరిని చూడాలో అర్థం కావట్లేదని.. అంత అందంగా ఉన్నారని పొగిడేశాడు. ఇది మన సినిమా ఈవెంట్ కాదని నితిన్ ఆపినా ఆగకుండా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక డైరెక్టర్ వెంకీ కుడుమల వెరైటీ ప్రమోషన్స్ మూవీపై ఇంట్రెస్ట్ కలిగించాయి. అయితే లేటెస్ట్ సాంగ్ ‘‘అది ధ సర్‌ప్రైజు’’తో ఫిల్మ్ రీచ్ మరింత పెంచుదామని ప్లాన్ చేశారు. ఇందుకోసం ఈ ఐటెమ్ నంబర్‌కు హాట్ బ్యూటీ కేతికా శర్మను ఎంచుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే సాగినా.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దెబ్బెట్టేశాడు. మరోసారి వల్గర్ హుక్ స్టెప్‌తో.. నెటిజన్లతో ఛీ అనిపించుకుంటున్నాడు.

‘‘పుష్ప 2’’లో పీలింగ్స్ సాంగ్‌కే ఈయన కొరియోగ్రఫీకి దుమ్మెత్తిపోసిన నెటిజన్లు ఈ పాటకు నెక్స్ట్ లెవల్ బూతులు వెతుక్కుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు లెండి. కేతికా శర్మతో స్కర్ట్ లేపించే బోల్డ్ స్టెప్పుకు తిట్ల పురాణం మొదలుపెట్టేశారు. శేఖర్ మాస్టర్ వల్ల సాంగ్, సినిమా రెండింటికీ ఎఫెక్ట్ పడుతుందని.. ఇలాంటి స్టెప్స్ ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. ఆయన భార్యతో ఇలాంటి స్టెప్స్ వేయించగలడా అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి హుక్ స్టెప్ మరీ ఇంత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందనుకోలేదని ట్రోల్ చేస్తున్నారు. ప్రతిసారి ఈ బూతులతో నిండిన స్టెప్స్‌తో బీపీ తెప్పిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.

Next Story