లీడర్ సీక్వెల్‌పై శేఖర్ కమ్ముల సెన్సేషనల్ కామెంట్స్.. ఈ జనాల గురించి సినిమా తీయాలంటే..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-18 09:15:02  IST  )

శేఖర్ కమ్ముల - రానా కాంబినేషన్‌లో వచ్చిన ‘లీడర్’ సినిమా బాక్సాఫీస్ హిట్. రానా ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూజ్ కావడం.. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించడం.. ఆ కటౌట్ బాగా వర్కౌట్ అయింది. భారీ కలెక్షన్ వసూల్ చేసింది. కాగా

లీడర్ సీక్వెల్‌పై శేఖర్ కమ్ముల సెన్సేషనల్ కామెంట్స్.. ఈ జనాల గురించి సినిమా తీయాలంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : శేఖర్ కమ్ముల - రానా కాంబినేషన్‌లో వచ్చిన ‘లీడర్’ సినిమా బాక్సాఫీస్ హిట్. రానా ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూజ్ కావడం.. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించడం.. హీరో కటౌట్ బాగా వర్కౌట్ అయింది. భారీ కలెక్షన్స్ వసూల్ చేసింది. కాగా ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడు రాబోతుందని డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. జనాలు రాజకీయ నాయకులను మించిపోయారు. దీనిపై స్టోరీ రాసుకోవాలి. సీక్వెల్ ప్లాన్ చేయాలి’ అని సమాధానమిచ్చాడు. ఓటర్లపై డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. హండ్రెడ్ పర్సెంట్ నిజమని అంటున్నారు నెటిజన్లు. దీనిపై పాజిటివ్, నెగెటివ్ కోణంలో మూవీ ప్లాన్ చేయాలని కోరుతున్నారు.

కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన ‘కుబేర’.. ఈ నెల 20న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే మూవీపై హైప్ క్రియేట్ కాగా ఇంకా ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న మూవీని కచ్చితంగా సరస్వతీ దేవీ తల ఎత్తుకుని చూస్తదంటూ డైరెక్టర్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో చెప్పుకు రావడం విశేషం.

Next Story