- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి సినిమా నుంచి ‘శశిరేఖ’ సాంగ్ విడుదల
చిరంజీవి సినిమా నుంచి ‘శశిరేఖ’ సాంగ్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ చిత్రం నుంచి రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘శశిరేఖ’ (Sasirekha) అనే పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సింగర్ మధుప్రియతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాడారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట అయిన ‘మీసాల పిల్ల’ భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం తదుపరి పాట విడుదల చేయడం.. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం చిత్రబృందంలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార (Nayanthara) హీరోయిన్. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీడియో






