శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ సాంగ్ విడుదల.. కానీ చివరి నిమిషంలో అభిమానులకు షాక్?

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-10 12:43:46  IST  )

చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) .

శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ సాంగ్ విడుదల.. కానీ చివరి నిమిషంలో అభిమానులకు షాక్?
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) . దీనికి సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ దర్శనమే రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

విశాల్ చంద్ర శేఖర్ దర్శనమే కోసం క్లాసిక్ మెలోడీ‌ని ఫ్రెష్ బీట్స్‌తో అద్భుతంగా కంపోజ్ చేశారు. మనసుని కట్టిపడేసే ట్రాక్ ఇది. యాజిన్ నిజార్ వోకల్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్తాయి. అతని వాయిస్ మెస్మరైజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శర్వా ఎమోషన్స్ అద్భుతంగా వర్ణిస్తుంది. స్క్రీన్‌పై శర్వా చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది. సంయుక్త అందంగా కనిపిస్తుంది. శర్వాతో మ్యాజికల్ కెమిస్ట్రీని పంచుకుంటుంది. వారు తమ ప్రేమకథను ప్రేక్షకులను అలరించే విధంగా పెర్ఫామ్ చేశారు. అయితే ఈ పాట విడుదలైన కొంత సమయానికే ప్రవైట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శనమే వీడియో యూట్యూబ్‌లో కనిపించడం లేదు. దీంతో శర్వానంద్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో విడుదలైనన విషయం తెలిసిందే. ఇక ఇందులో హీరో, హీరోయిన్ రొమాన్స్ హద్దులు మీరి ఉన్నట్లు చూపించారు. ఈ కారణంతోనే ఫుల్ సాంగ్‌ను ప్రైవేట్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

Next Story