బైకర్‌గా శర్వానంద్.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ అదుర్స్

by Ajay Maddhiboyina |

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. దీపావళి పండుగ సందర్బంగా అభిమానులకు గిఫ్ట్ ఇస్తూ బైకర్ అనే సినిమాను ప్రకటించ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

బైకర్‌గా శర్వానంద్.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ అదుర్స్
X

దిశ, వెబ్ డెస్క్: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. దీపావళి పండుగ సందర్బంగా అభిమానులకు గిఫ్ట్ ఇస్తూ బైకర్ అనే సినిమాను ప్రకటించ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకున్నట్టు ప్ర‌క‌టించారు. సినిమా పోస్ట‌ర్ చూస్తుంటే శ‌ర్వానంద్ యంగ్ రగ్డ్ లుక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా సినిమా పక్కా యూత్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ, లవ్ స్టోర్స్ట్ డ్రామా ఇలా ఎప్పటికప్పుడు జోనర్ మారుస్తుంటారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Next Story