సూపర్ హిట్ మూవీ ‘లుకా చుప్పీ’ సీక్వెల్‌లో స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న శార్వరీ వాఘ్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-24 14:43:41  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్(Sharvari Wagh) దర్శకురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

సూపర్ హిట్ మూవీ ‘లుకా చుప్పీ’ సీక్వెల్‌లో స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న శార్వరీ వాఘ్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్(Sharvari Wagh) దర్శకురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు చిత్రాలు తెరకెక్కించిన ఈ భామ పలు టీవీ షోల్లోనూ పాల్గొని అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. నటనపై ఆసక్తితో ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాతో నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత గుడ్ బాయ్, మహారాజ్(Maharaj), వేద (veda), ముంజ్యా వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శార్వరి బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన శార్వరి సూపర్ హిట్ మూవీ ‘లుకా చుప్పీ’(Luka Chuppi) సీక్వెల్‌లో నటించనున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించగా.. వారి ప్లేస్‌లో ఇప్పుడు వీరిద్దరు నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) తెరకెక్కిస్తుండగా.. మాడ్‌డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధినేష్ విజన్ నిర్మిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందట. వరుణ్ ధావన్ తన తండ్రి దర్శకత్వంలో చేస్తున్న ‘హై జవానీతో ఇష్క్ హేనా హై’, సన్నీ డియోల్ బోర్డర్-2 వంటి చిత్రాల షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్ట్స్ వరుణ్ ‘లుకా చుప్పీ-2’షూట్‌లో జాయిన్ కానున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story