- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డాన్’ ఫ్రాంచైజ్ చేస్తా.. కానీ ఆ సౌత్ డైరెక్టర్ కావాలి.. సంచలనం సృష్టిస్తున్న షారుఖ్ కండిషన్
by Sujitha Rachapalli |
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరో ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

X
దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరో ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన త్వరలో ‘డాన్’ ఫ్రాంచైజీకి వచ్చేస్తున్నాడని.. కానీ ఇందుకు ఓ కండిషన్ పెట్టాడని తెలుస్తోంది. ‘జవాన్’ లాంటి మాస్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ.. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉండాలనే కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రం ఫైనలైజ్ కావాలని కోరుకుంటున్న షారుఖ్ ఫ్యాన్స్.. ‘డాన్’ అంటేనే ఎస్ఆర్‌కే అని.. అట్లీ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతాడని అభిప్రాయపడుతున్నారు.
Next Story






