- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫస్ట్ నేషనల్ అవార్డు.. థాంక్స్ వీడియోతో అభిమానుల మనసు దోచుకున్న షారుఖ్.. అట్లీ స్పెషల్ మెన్షన్..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనసినిమా కెరీర్‌లో ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ‘జవాన్’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా.. థాంక్స్ వీడియో రిలీజ్ చేశాడు షారుఖ్. ఈ మధ్య షూటింగ్‌లో

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనసినిమా కెరీర్‌లో ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ‘జవాన్’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా.. థాంక్స్ వీడియో రిలీజ్ చేశాడు షారుఖ్. ఈ మధ్య షూటింగ్‌లో గాయపడ్డ ఆయన ఫారిన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా.. అక్కడి నుంచే వీడియో షేర్ చేశాడు. తనను నేషనల్ అవార్డుతో గౌరవించినందుకు.. జ్యూరీ, చైర్మన్, ఐఅండ్‌బీ మినిస్ట్రీకి థాంక్స్ చెప్పాడు. భారత సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
తనతో పని చేసిన రచయితలు, దర్శకులు, టీమ్ అందరికీ థాంక్స్ చెప్పిన ఆయన.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ అండ్ టీమ్‌ను స్పెషల్‌గా మెన్షన్ చేశాడు. మాస్ అంటూ చీర్స్ చెప్పాడు. తన ఫ్యామిలీ ప్రస్తుతం తనను చిన్న పిల్లాడి లాగా చూసుకుంటుందని.. వారికి కూడా థాంక్స్ చెప్పిన ఆయన.. అభిమానులు అందరికీ హగ్స్ అంటూ ప్రేమను కురిపించాడు. ఈ నేషనల్ అవార్డు అచీవ్‌మెంట్ మాత్రమే కాదని భవిష్యత్తులో చేయబోయే పని గురించిన బాధ్యతను గుర్తుచేస్తుందని చెప్పాడు షారుఖ్.
- Tags
- Shah Rukh Khan




