బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పిన షన్ను.. ప్రియురాలితో సైలెంట్‌గా పెళ్లి!

by Mallepaka Hamsa |

బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సైలెంట్‌గా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు.

బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పిన షన్ను.. ప్రియురాలితో సైలెంట్‌గా పెళ్లి!
X

దిశ, సినిమా: యూట్యూబ్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన షణ్ముఖ జస్వంత్ అలియాస్ షన్ను ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి హీరోగా మారాడు. దీంతో బిగ్‌బాస్‌లోకి వెళ్తే చాన్స్ దక్కించుకుని రన్నరప్‌గా నిలిచాడు. అలాగే వరుస వరుసగా సిరీస్, మ్యూజిక్ అల్బమ్ప్ చేస్తూ హీరోగా మారాడు. ఇక ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక షన్ను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయానికొస్తే.. బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సైలెంట్‌గా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో షన్ను వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా.. గతంలో షన్ను సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనాతో సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఎన్నో వీడియోలు, కవర్ సాంగ్స్ చేసి బెస్ట్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, బిగ్‌బాస్ షో తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుని అధికారికంగా విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు షన్ను జీవితంలోకి వైష్ణవి చోడిశెట్టి ప్రవేశించింది. వీరిద్దరూ ప్రేమలో పడటం, ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరికీ ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలోనే షన్ను తన కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తన జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా షన్ను పెళ్లి ముచ్చట్లతోనే సందడిగా మారింది.

Next Story