- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shanmukha: చేసిన తప్పులకు శిక్షలు తప్పవు.. ఓటీటీలోకి మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ మూవీ
ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటించిన లేటెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘షణ్ముఖ’

దిశ, సినిమా: ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటించిన లేటెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘షణ్ముఖ’ (Shanmukha). సాప్పాని (Sappani) దర్శకత్వం వహించిన ఈ మూవీ హై స్టాండర్డ్ విజువల్స్ ఎఫెక్ట్స్ (Visuals effects), గ్రాఫిక్స్(Graphics)తో విజువల్ వండర్‌గా రూపొందింది. రిలీజ్‌కు ముందే ప్రమోషన్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎమ్ ‘షణ్ముఖ’ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. షణ్ముఖ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. ‘ఒక పోలీసు, ఒక పండితుడు, అండ్ ఒక పురాతన రహస్యం! అడవిలో లోతుగా పాతిపెట్టబడిన మరచిపోయిన కథలు, దాచిన నిధులు అండ్ రహస్యాలలోకి ప్రవేశించండి. షణ్ముఖ చిత్రం ఏప్రిల్ 11 నుండి ahaలో స్ట్రీమింగ్ కానుంది’ అంటూ పోస్ట్ పెట్టారు.
కాగా.. ‘సురులు అయినా అసురులు అయినా.. చేసిన తప్పులకు శిక్షలు అనుభవించకుండా తప్పించుకోలేరు. పూర్వం ఒక సురుడు తప్పుచేసి అసురుడు అయ్యాడు. శాప విమోచనం కోసం తపించసాగాడు.. అయితే.. ఇది అతని కథ కాదు.. ఒక అసురుడిని ఎదురించిన ధీరుడు కథ’ అనే స్టోరీగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకులోక పోయింది. దీంతో థియేటర్‌లోకి వచ్చిన 22 రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్(OTT streaming)కు సిద్ధం అయింది.
A cop, a scholar, and an ancient mystery!
— ahavideoin (@ahavideoIN) April 10, 2025
Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3






