Shanmuka trailer: చేసిన తప్పులకు శిక్షలు తప్పవు.. మిస్టరీ అండ్ థ్రిల్లింగ్‌గా షణ్ముఖ ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-07-31 08:33:43  IST  )

ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తోన్న డివోషనల్ థ్రిల్లర్ (Devotional thriller) చిత్రం ‘షణ్ముఖ’

Shanmuka trailer: చేసిన తప్పులకు శిక్షలు తప్పవు.. మిస్టరీ అండ్ థ్రిల్లింగ్‌గా షణ్ముఖ ట్రైలర్
X

దిశ, సినిమా: ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తోన్న డివోషనల్ థ్రిల్లర్ (Devotional thriller) చిత్రం ‘షణ్ముఖ’ (Shanmuka). సాప్పాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా.. అతడి బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంబోతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘షణ్ముఖ’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హై స్టాండర్డ్ విజువల్స్ ఎఫెక్ట్స్ (Visuals effects), గ్రాఫిక్స్‌(Graphics)తో విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈనెల 21న పెద్ద స్క్రీన్‌లపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

‘సురులు అయినా అసురులు అయినా.. చేసిన తప్పులకు శిక్షలు అనుభవించకుండా తప్పించుకోలేరు. పూర్వం ఒక సురుడు తప్పుచేసి అసురుడు అయ్యాడు. శాప విమోచనం కోసం తపించసాగాడు.. అయితే.. ఇది అతని కథ కాదు.. ఒక అసురుడిని ఎదురించిన ధీరుడు కథ’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ (Background voice) ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఎంతో మిస్టరీగా సాగింది. ఇందులో ఆది పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించగా.. అవికా గోర్ రీసెర్చ్‌తో ఈ సినిమా కొత్త మలుపు తిరిగే విధంగా కనపడుతోంది. మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

Next Story