సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేసిన హీరోయిన్.. అడవుల్లో దొరికిన తల...

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-06 10:31:18  IST  )

ఒకప్పటి కన్నడ హీరోయిన్ షనయా కత్వే కెరీర్‌లో పీక్స్ చూస్తున్న టైమ్‌లో ఒక్క తప్పుతో జీవితాన్ని జైలుపాలు చేసుకుంది. ‘ఒండు ఘంటేయ కథే’ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న ఆమె.. ఎవరికీ డౌట్ రాకుండా సోదరుడి మర్డర్ ప్లాన్ చేసింది.

సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేసిన హీరోయిన్.. అడవుల్లో దొరికిన తల...
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పటి కన్నడ హీరోయిన్ షనయా కత్వే కెరీర్‌లో పీక్స్ చూస్తున్న టైమ్‌లో ఒక్క తప్పుతో జీవితాన్ని జైలుపాలు చేసుకుంది. ‘ఒండు ఘంటేయ కథే’ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న ఆమె.. ఎవరికీ డౌట్ రాకుండా సోదరుడి మర్డర్ ప్లాన్ చేసింది. తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి జీవించే ఆమె.. హుబ్లీలో పేరెంట్స్‌తో కలిసి ఏప్రిల్ 9, 2021న మూవీ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ రోజు, నెక్స్ట్ డే కూడా అతను కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు తండ్రి.

కట్ చేస్తూ మూడు రోజుల తర్వాత హుబ్లీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో అతని తల కనిపించింది. ఓ వ్యక్తి అడవి గుండా వెళ్తుండగా.. ఓ ప్లాస్టిక్ కవర్ అనుమానాస్పదంగా కనిపించింది. తెరిచి చూస్తే తల ఉండటంతో దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు.. అక్కడికి సమీపంలో ఉన్న ఓ బావిలో బాడీని గుర్తించారు. తలకు సంబంధించిన ఫొటోలు తండ్రికి చూపించడంతో స్పృహ తప్పిపడిపోయాడు. కాగా అడవిలో రెండు కార్లు రక్తపు మరకలతో ఉండగా.. ఒకటి అమన్ గిరనివాలే పేరుతో రిజిస్టర్ కాగా మరొకటి హీరోయిన్ పేరు మీద రిజిస్టర్ అయింది. తమదైన స్టైల్‌లో విచారించగా.. తనే తమ్ముడిని మర్డర్ చేశానని ఒప్పుకుంది.

తాను ముస్లిం వ్యక్తి నియాజ్‌ను ప్రేమించానని.. తమ్ముడు రాకేష్ తమను చూశాడని.. అతనితో లైఫ్ బాగోదని.. ఇక్కడితో రిలేషన్ ఎండ్ చేయాలని సూచించాడని తెలిపింది. కానీ తనకు ఈ విషయం నచ్చకపోవడంతో ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపింది. కాగా ఆమెను ఏప్రిల్ 22, 2021లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Next Story