- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shanaya Kapoor: బోల్డ్ సినిమాతో రాబోతున్న షానయా కపూర్.. ఆమెతో నటించడంపై హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ కిడ్స్‌లో షానయా కపూర్(Shanaya Kapoor) ఒకరు. నటుడు అనీల్ కపూర్ సోదరుడు సంజ్య కుమార్తె షానయా కపూర్.

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ కిడ్స్‌లో షానయా కపూర్(Shanaya Kapoor) ఒకరు. నటుడు అనీల్ కపూర్ సోదరుడు సంజ్య కుమార్తె షానయా కపూర్. ‘స్క్రూ డీలా’(Screw Dheela) చిత్రంతో వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ భామ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆదర్శ్ గౌరవ్ సరసన ‘తూయా మెయిన్’ (Tuyaa Main)మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
దీనిని హిట్ డైరెక్టర్ బెజోయ్ నంబియార్(Bejoy Nambiar) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిమాన్షు శర్మ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతుంది. సరికొత్త జంటతో.. అత్యధిక బోల్డ్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘తూ యా మెయిన్’ మూవీ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. డేట్ నైట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక షూటింగ్ స్టార్ట్ అవడంపై ఆదర్శ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సినిమాలో పనిచేయడం ప్రారంభించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకు ముందు చేసిన దానికి పూర్తిగా భిన్నమైన శైలి ఇది. అదే నన్ను ఈ ప్రాజెక్ట్ వైపు ఆకర్షించింది. విభిన్నమైన సినిమాటిక్ వాయిస్ ఉన్న బెజోయ్ నంబియార్‌తో కలిసి పనిచేయడం షానయా కపూర్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. మేము సృష్టిస్తున్న వాటిని ప్రేక్షకులు అనుభవించే వరకు నేను వేచి ఉండలేను. షానయాతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. మేము ఇప్పటివరకు టీజర్ మాత్రమే చిత్రీకరించాము. కానీ ఇది మంచి అనుభవం’’ అని చెప్పుకొచ్చాడు.






