- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే మొదలు కాబోతున్నది.. జాంబీ సినిమాతో వచ్చేస్తున్న యంగ్ హీరోయిన్
ఇటీవల ‘తూ యా మై’ సినిమాతో ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ని పంచింది బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె, హీరోయిన్ శనయా కపూర్.

దిశ, సినిమా: ఇటీవల ‘తూ యా మై’ సినిమాతో ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ని పంచింది బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె, హీరోయిన్ శనయా కపూర్. ఇప్పుడామే తన నెక్ట్స్ సినిమా కోసం హీరో టైగర్ ష్రాఫ్‌తో చేతులు కలిపినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ ఎ. నడియాడ్‌వాలా.. టైగర్, శనయాల కాంబోలో ఓ జాంబీ కామెడీని రూపొందించే ప్రయత్నంలో ఉన్నటుల తెలుస్తుండగా.. దీనికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ అహ్మద్ ఖాన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన ‘భాఘీ 3, హీరోపంతీ 2’ హిట్ అందుకోగా.. ఇప్పుడు ఇది మూడో ప్రాజెక్టుగా రాబోతున్నది. తాజాగా జాంబీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాను అఫీషియల్‌గా ఓకే చేస్తూ.. ‘అవును, ఆ సినిమా పనులు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా తెరకెక్కబోతుంది.. మేము ఇప్పటికే ఫోటోషూట్ పూర్తి చేశాము. మిగిలిన నటీనటులను ఖరారు చేయడం మాత్రమే ఇక మిగిలి ఉంది. ఇది పలువురు ప్రముఖ నటులతో కూడిన 'మల్టీ-స్టారర్' చిత్రం కానుంది. దీని నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి’ అని ఆయన తెలిపారు.
- Tags
- Shanaya Kapoor






