మన ఆది హిట్ కొట్టాడు.. సాయి కుమార్ సంతోషం

by Sujitha Rachapalli |

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన చిత్రం డిసెంబర్ 25న విడుదలై థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

మన ఆది హిట్ కొట్టాడు.. సాయి కుమార్ సంతోషం
X

దిశ, సినిమా : ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన చిత్రం డిసెంబర్ 25న విడుదలై థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రముఖ రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అరవింద్.. ‘శంబాల’ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశానని తెలిపాడు. ఆదికి వచ్చిన సక్సెస్ చూసి అందరూ సంతోషిస్తున్నారని డైరెక్టర్ బాబి తెలపగా.. నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని మరోసారి నిరూపించారని సంతోషం వ్యక్తం చేశాడు సందీప్ కిషన్. ‘శంబాల’ను థియేటర్‌లోనే చూడమని కోరిన హీరో ఆది.. కచ్చితంగా డిజప్పాయింట్ కారని హామీ ఇచ్చాడు. ఇక ప్రతీ ఒక్కరూ ‘మన ఆది హిట్ కొట్టాడు’అని చెప్తుంటే ఆనందంగా ఉందన్నాడు సాయి కుమార్.

Next Story