- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణ్‌బీర్ కపూర్‌తో రొమాన్స్ చేయడానికి చనిపోతున్నా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక ఈ మూవీలో తన నటన, అందంలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక అక్కడే అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక గత ఏడాది ‘మహారాజ్’ (Maharaj)మూవీతో వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలినీ పాండే, రణ్‌బీర్ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘రణ్‌బీర్ కపూర్‌తొ రొమాన్స్ చేయాలని ఆసక్తిగా ఉంది. అందుకోసం చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను. నాకు ఆయనంటే అంత ఇష్టం. అతనితో కలిసి నటిస్తే బాగుంటుంది. ఆయన నటన అంటే పిచ్చి.. రణ్‌బీర్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. అతని కళ్ళను చూడటం చాలా బాగుంటుంది. ఆయన ఏం చేస్తాడో తెలియదు.. అతని ముఖాన్ని కదిలించకపోయినా.. కళ్లలో ఓ మ్యాజిక్ ఉంది. రణ్‌బీర్ కళ్లతోనే హృదయంలో ఉన్న భావాన్ని వ్యక్తపరుస్తాడు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షాలిని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






