Shalini Pandey: చాలా సంవత్సరాలుగా నేను మోస్తున్న కల నెరవేరింది.. వారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ షాలిని పాండే ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Shalini Pandey: చాలా సంవత్సరాలుగా నేను మోస్తున్న కల నెరవేరింది.. వారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ షాలిని పాండే ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఘన విజయం తన ఖాతాలో వేసుకున్న ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘మహానటి, ఇద్దరి లోకం ఒక్కటే, 118 నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది ‘మహారాజ్’(Maharaj) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక అప్పటి షాలిని అవకాశాలు రాకపోవడంతో ఖాళీగా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, షాలిని పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మూడు సంవత్సరాల క్రితం, జయేష్‌భాయ్ జోర్దార్ హిందీ చిత్ర పరిశ్రమలోకి నా మొదటి అడుగు.

చాలా సంవత్సరాలుగా నేను మోస్తున్న కల నెరవేరింది. యష్ రాజ్ మాయాజాలం, రణ్‌వీర్ సింగ్ అద్భుతమైన ప్రతిభ, ఆది సర్ పూర్తి విశ్వాసం, నా అంతర్ దృష్టిని ఎల్లప్పుడూ నమ్మే నా అద్భుతమైన దర్శకుడు దివ్యతో ఇది నిజమైంది. నేను భయపడ్డాను, కళ్ళు విశాలంగా ఉన్నాయి. వారు నన్ను ఎదగడానికి, ఎగరడానికి అనుమతించారు. నన్ను ఒక కేఫ్‌లో చూసి ప్రతిదీ మార్చినందుకు షనూస్‌శర్మకి ధన్యవాదాలు. నా చేయి పట్టుకున్న బృందానికి, నా హృదయాన్ని పట్టుకున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు! జయేష్‌భాయ్ మొత్తం బృందానికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. అలాగే ‘జయేషాబాయ్ జోర్దార్’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు లవ్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story