ఆ సినిమా చూసి రెండు రోజులు నిద్ర పోలేదు.. కుర్ర హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Sujitha Rachapalli |

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే ‘అర్జున్ రెడ్డి’తో సూపర్ ఫేమ్ అయిపోయింది. ఒక్క సినిమా సక్సెస్‌తోనే వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన బ్యూటీ.. తాజాగా కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించింది.

ఆ సినిమా చూసి రెండు రోజులు నిద్ర పోలేదు.. కుర్ర హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : యంగ్ హీరోయిన్ షాలినీ పాండే ‘అర్జున్ రెడ్డి’తో సూపర్ ఫేమ్ అయిపోయింది. ఒక్క సినిమా సక్సెస్‌తోనే వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన బ్యూటీ.. తాజాగా కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించింది. అయితే ఈ మధ్య ధనుష్, కృతి సనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా చూసిన ఆమె.. ఇందుకు సంబంధించిన రివ్యూ ఇచ్చింది. ‘48 గంటలు నిద్రపోలేదు. నా హార్ట్‌లో ‘తేరే ఇష్క్ మే’ ఇంకా బర్న్ అవుతోంది. ధనుష్ సార్ .. మీరు చెప్పే ఫినామినల్ అంటే ఇదే. రెహమాన్ సార్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్. కృతి సనన్ బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ ప్యూర్ మాస్టర్ క్లాస్ డైరెక్షన్’ అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న షాలిని ఫ్యాన్స్.. ఆమె మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చక్కగా, తిని పడుకోవాలని.. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు.

Next Story