Farzi 2: మొదలైన ఫర్జీ 2

by Pulgam srinivas |

ఫర్జీ సీజన్ 2 షూటింగ్ ప్రారంభించినట్లు షాహిద్ కపూర్ తెలియజేశాడు.

Farzi 2: మొదలైన ఫర్జీ 2
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మెన్ సిరీస్ ఒకటి. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‍తో వీరిద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సిరీస్‍కు కొనసాగింపుగా వచ్చిన ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కూడా జనాలను ఆకట్టుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫర్జీ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో షాహిద్ కపూర్, రాశి ఖన్నా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సిరీస్ 2023వ సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్‍కు జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సిరీస్ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా ఈ సిరీస్ రెండవ భాగం షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో చాలామంది అసలు ఈ సిరీస్‍కు రెండవ భాగం ఉంటుందా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేశారు.

అలాంటి సమయంలో ఫర్జీ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. నిన్నటి నుండి ఫర్జీ సీజన్ 2 యొక్క షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఇందులో ప్రధాన పాత్రలో నటించిన షాహిద్ కపూర్ అధికారికంగా తన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు. ఫర్జీ రెండవ సీజన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story