National Film Award: బెస్ట్ యాక్టర్స్‌గా షారుఖ్, విక్రాంత్‌

by Gantepaka Srikanth |

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan)కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.

National Film Award: బెస్ట్ యాక్టర్స్‌గా షారుఖ్, విక్రాంత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan)కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. షారుఖ్‌తో పాటు విక్రాంత్‌ మస్సేకు కూడా ఉత్తమ నటుడి(Best Actor Award) అవార్డు దక్కింది. జవాన్‌ చిత్రానికి గాను షారుఖ్‌కు, 12th ఫెయిల్‌ సినిమాకు గాను విక్రాంత్‌కు అవార్డులు లభించాయి. మరోవైపు ఉత్తమ హిందీ చిత్రం-కథల్‌. మిసెస్‌ ఛటర్జీ సినిమాకుగాను రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డ్‌ దక్కింది. 2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌ను కేంద్రం ప్రకటించింది. అన్ని భాషల చిత్రాలు పరిశీలించి.. 15 విభాగాల్లో అవార్డులు ఇచ్చినట్లు జ్యూరీ ప్రకటించింది.

Next Story