- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆల్ఫా’ టీజర్‌పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు.. ఆలియాను సిగ్మా గర్ల్ అంటూ పోస్ట్
వెల్ డన్ అలియా.. కొన్ని ఏళ్లుగా నీ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టావు , ఇప్పుడేమో విలన్ల ఎముకలు విరుస్తున్నావు

దిశ, సినిమా: యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 7వ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా శివ రావల్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో ఆలియా భట్, శార్వరి వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై నెటిజన్లతో పాటు స్టార్ హీరోల ప్రశంసలు దక్కించుకుంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా, ‘ఆల్ఫా’ టీజర్‌పై బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రశంసలు కురిపిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న అలియా భట్ యాక్షన్‌పై షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వెల్ డన్ అలియా.. కొన్ని ఏళ్లుగా నీ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టావు , ఇప్పుడేమో విలన్ల ఎముకలు విరుస్తున్నావు . రోజురోజుకూ నీ టాలెంట్ పెరుగుతూనే ఉంది. ఈ 'ఆల్ఫా' సినిమా అందరి మనసులు గెలవాలని కోరుకుంటున్నాను. అలాగే సీక్వెల్ కోసం కొందరు విలన్లనైనా ప్రాణాలతో వదిలేయ్.. గో గెట్ దెమ్ సిగ్మా గర్ల్!" అంటూ అలియాను సరదాగా అభినందించారుటీజర్‌లో మెంటర్‌గా, విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన బాబీ డియోల్‌ను షారుఖ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. "లార్డ్ బాబీ.. నువ్వు విలన్‌గా బ్యాడ్‌గా ఉన్నప్పుడే చాలా బాగుంటావు. నీకు నా పెద్ద హగ్" అని రాసుకొచ్చారు. చివర్లో ఈ చిత్ర దర్శకుడు శివ్ రావైల్‌తో పాటు ‘ఆల్ఫా’ టీమ్ మొత్తానికి షారుఖ్ ఖాన్ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. షారుఖ్ చేసిన ఈ పోస్ట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ‘ఆల్ఫా’ చిత్రం జూన్ 3న థియేటర్స్‌లోకి రాబోతోంది.






